సహజీవనంపై ఇండోనేసియా నిషేధం.. ఉల్లంఘిస్తే జైలుకే!

07-12-2022 Wed 07:30 | International
Advertisement
  • వివాహేతర శృంగారంపైనా నిషేధం
  • సహజీవనానికి ఆరు నెలలు, వివాహేతర సంబంధాలకు ఏడాది జైలు శిక్ష
  • కొత్త చట్టంపై హక్కుల సంఘాల మండిపాటు
Advertisement
వివాహేతర సంబంధాలు, సహజీవనంపై ఇండోనేసియా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ రెండింటినీ నిషేధిస్తూ తీసుకొచ్చిన బిల్లుకు నిన్న పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఈ కొత్త చట్టం ప్రకారం వివాహేతర సంబంధాలను నేరంగా పరిగణిస్తారు. ఉల్లంఘిస్తే ఏడాది జైలు శిక్ష విధిస్తారు. అలాగే, పెళ్లి చేసుకోకుండా కలిసి ఉంటే (సహజీవనం) ఆరు నెలల జైలు శిక్ష తప్పదు. ఈ కొత్త బిల్లుకు అన్ని పార్టీలు ఆమోదం తెలిపాయి. 

బిల్లు ఆమోదం పొందిన అనంతరం న్యాయ, మానవహక్కుల మంత్రి యసొన్నా లాలోరి మాట్లాడుతూ..  అనేకమంది అభిప్రాయాలు, కీలకమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించామని, అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే  ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అయితే, ప్రభుత్వం తీసుకున్నఈ నిర్ణయంపై దేశంలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 

వివాహేతర శృంగారంపై నిషేధం పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వ్యాపారులు మండిపడుతున్నారు. అయితే, ఇండోనేసియాకు వచ్చే విదేశీయులపై మాత్రం కొత్త చట్టం వర్తించదని అధికారులు చెబుతున్నారు. ఇండోనేసియాలో ప్రపంచంలోనే అత్యధికంగా ముస్లిం జనాభా ఉంది. ఇప్పటికే ఇక్కడ స్వలింగ సంపర్కంపై నిషేధం ఉంది.

మరోవైపు, ఈ కొత్తచట్టంపై అక్కడి హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. ఇది పౌర హక్కుల అణచివేత తప్ప మరోటి కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాగా, ఈ చట్టానికి ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో ఆమోదం తెలపాల్సి ఉంది. ఆయన ఆమోదం తెలిపిన మూడేళ్లకు ఈ చట్టం అమల్లోకి వస్తుంది.
Advertisement
IndonesiaExtra Marital AffairsLive In Relation

More Telugu News

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44
..more